రవి అనే బాలుడు సెలవుల్లో
తిరుపతి ప్రయాణానికి వెళ్తాడు.
రైలులో దొంగల ఆట కట్టించడంతో
అతనిపై కక్ష పెంచుకున్న
దొంగల ముఠా అతడిని కిడ్నాప్ చేస్తుంది.
అవయవాల అక్రమ రవాణా చేసే
బోసు ముఠా స్థావరంలో
మరికొంత మంది పిల్లలతో కలిసి
రవి చిక్కుకుంటాడు.
ధైర్యంగా ఉన్న కమల్,
రాహుల్, తేజలతో కలిసి
అక్కడి నుండి తప్పించుకోవడానికి,
ఇతర పిల్లలను రక్షించడానికి
రవి ప్రణాళిక వేస్తాడు.
నవతరం పిల్లల ధైర్యం,
చురుకుదనం మరియు సమస్యలను
ఎదుర్కొనే సామర్థ్యాన్ని
ప్రతిబింబించే సాహస నవల ఇది.
కథనం వేగంగా సాగుతూ
చివరివరకు ఉత్కంఠను కలిగిస్తుంది.
మంచి పుస్తకం
12-13-439, వీధి నెంబర్ 1
తార్నాక, సికింద్రాబాద్ – 500017
📞 9490746614
✉️ info@manchipustakam.in